Perni Nani: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని మరోసారి హింట్ ఇచ్చిన పేర్ని నాని

Perni Nani hits that he will not contest next elections
  • ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఫోన్ చేసిన పేర్ని నాని
  • జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాని
  • వచ్చే పుట్టినరోజున మాజీ ఎమ్మెల్యే హోదాలో గ్రీటింగ్స్ చెపుతానని వ్యాఖ్య
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని మరోసారి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి హింట్ ఇచ్చారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు నిన్న ఫోన్ చేసి పేర్ని నాని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే పుట్టినరోజున మాజీ ఎమ్మెల్యే హోదాలో శుభాకాంక్షలు తెలియజేస్తానని చెప్పారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయం స్పష్టమవుతోంది. తన స్థానంలో తన కుమారుడిని వైసీపీ తరపున బరిలోకి దించాలని ఆయన భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఇప్పటికే కొన్ని సందర్భాల్లో వెల్లడించారు.
Perni Nani
YSRCP

More Telugu News