Bengaluru: రేపు బెంగళూరు బంద్

Bengaluru Bandh on September 26

  • తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నుంచి అదనపు జలాలు
  • కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ ఆదేశాలు
  • దీనికి అనుగుణంగా నీటిని విడుదల చేయనున్న కర్ణాటక సర్కారు
  • దీన్ని వ్యతిరేకిస్తూ కన్నడ అనుకూల సంఘాల బంద్ పిలుపు

ద కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ అనుకూల సంస్థలు ఈ నెల 26న బెంగళూరు బంద్ కు పిలుపునిచ్చాయి. మరో 15 రోజుల పాటు 5,000 క్యూసెక్కుల చొప్పున నీటిని కావేరీ బేసిన్ నుంచి తమిళనాడుకు విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఇటీవలే కర్ణాటక సర్కారును ఆదేశించింది. కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ సిఫారసుల మేరకు ఈ ఆదేశాలు ఇచ్చింది. దీంతో తమిళనాడుకు నీటి పంపకంపై ఈ నెల 26 నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక కేబినెట్ ప్రకటించింది. 

దీనికి వ్యతిరేకంగా కన్నడ అనుకూల సంఘాలు, సంస్థలు బంద్ ను చేపడుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయనున్నాయి. రేపటి రోజున బెంగళూరుతో పాటు కర్ణాటక వ్యాప్తంగా బంద్ చేపట్టాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీనిపై ఆయా సంఘాలు ఈ రోజు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. కర్ణాటక వాటర్ కన్జర్వేషన్ కమిటీ ప్రెసిడెంట్ కురుబుర్ శంతకుమార్ ఈ బంద్ కు నాయకత్వం వహిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు ఐటీ కంపెనీలు, ఫిల్మ్ చాంబర్ బంద్ కు మద్దతుగా 26న సెలవు ప్రకటించాలని కోరారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ ఈ బంద్ కు మద్దతు తెలిపింది. ఓలా ఊబర్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియషన్ కూడా అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో విమానాశ్రయ క్యాబ్ సేవలపై ప్రభావం పడనుంది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ సైతం బంద్ కు మద్దతు పలికాయి. బంద్ కు కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ సంఘీభావం ప్రకటించింది.

  • Loading...

More Telugu News