United States embassy: మూడు నెలల్లో 90 వేల భారత విద్యార్థులకు అమెరికన్ వీసాలు
- జూన్ నుంచి ఆగస్ట్ మధ్య జారీ చేసినట్టు ప్రకటించిన అమెరికన్ ఎంబసీ
- ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత్ లోనే మంజూరు
- భారత్-అమెరికా విద్యా సంబంధాల్లో మైలురాయిగా అభివర్ణన
ఈ ఏడాది భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో అమెరికన్ వీసాలు మంజూరయ్యాయి. ఈ వేసవిలో 90,000 భారత విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్టు భారత్ లోని అమెరికన్ ఎంబసీ ప్రకటించింది. జూన్, జులై, ఆగస్ట్ నెలల్లో వీటిని మంజూరు చేసినట్టు తెలిపింది. భారత్-అమెరికా మధ్య విద్యా సంబంధాల్లో దీన్నొక మైలురాయిగా అభివర్ణించింది.
‘‘ఈ వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా అమెరికా జారీ చేసిన విద్యార్థి వీసాల్లో ఒకటి భారత్ నుంచే ఉంది. తమ ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అందరికీ అంతా మంచే జరగాలి. అర్హులైన దరఖాస్తుదారులు అందరూ తమ కోర్సుల్లో సకాలంలో చేరి ఉంటారు’’ అని అమెరికన్ ఎంబసీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమెరికాలోని విద్యా సంస్థల్లో సుమారు 2 లక్షలకు పైగా భారత విద్యార్థులు కోర్సులు చేస్తున్నారు. అమెరికాలోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత విద్యార్థులు 20 శాతంగా ఉన్నారు.