Asia Cup: ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన టీమిండియా మహిళల జట్టు

Indian women Cricket team wins gold medal in Asian Games
  • ఫైనల్స్ లో శ్రీలంక జట్టును ఓడించిన భారత్
  • 19 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇండియా
  • 20 ఓవర్లలో 116 పరుగులు చేసిన భారత్
ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు సత్తా చాటింది. టీ20 పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్స్ లో శ్రీలంకను ఓడించి గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది. ఫైనల్స్ లో శ్రీలంకను భారత మహిళల జట్టు 19 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేసింది. భారత జట్టులో స్మృతి మందాన 46 పరుగులు, జెమీమి రోడ్రిగ్స్ 42 రన్స్ చేశారు. శ్రీలంక జట్టులో హాసిని పెరీరా 25 రన్స్, నీలాక్షి డిసిల్వా 23 పరుగులు చేశారు.
Asia Cup
Team India
Women Team
T20
Gold Medal

More Telugu News