Dharmana Prasada Rao: భూదాన్ - గ్రామదాన్ సవరణ బిల్లుతో పాటు పలు బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం
- అసైన్డ్ భూములు 20 ఏళ్లు దాటిన తర్వాత అమ్ముకునేలా చట్ట సవరణ
- షేక్ జఫ్రీన్ కు గ్రూప్ 1 పోస్టు ఇచ్చేందుకు ఆమోదం
- మూడు చక్రాల వాహనాలకు లైఫ్ ట్యాక్స్ కాకుండా త్రైమాసిక పన్ను తీసుకొచ్చే బిల్లుకు ఆమోదం
ఏపీ అసెంబ్లీలో ఈరోజు పలు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. భూదాన్ - గ్రామదాన్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. సభలో రెవెన్యూ మంత్రి మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టానికి కొన్ని మార్పులు చేశామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేశామని చెప్పారు.
ఆటోలు వంటి మూడు చక్రాల రవాణా వాహనాలకు లైఫ్ ట్యాక్స్ కాకుండా త్రైమాసిక పన్ను విధానాన్ని తీసుకొచ్చేలా మెటార్ వెహికల్ ట్యాక్సేషన్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు.