digvijay singh: కాంగ్రెస్‌లో చేరడానికి బీజేపీ సీనియర్లు ప్రయత్నిస్తున్నారు: దిగ్విజయ్ సింగ్

Several leaders of BJP want to join Congress Digvijaya Singh
  • త్వరలో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • ఇక్కడ బీజేపీని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్య
  • ఓటమిని గ్రహించిన బీజేపీ సీనియర్లు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారన్న దిగ్విజయ్
బీజేపీకి చెందిన సీనియర్ నేతలు తమ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో డిగ్గీ రాజా మాట్లాడుతూ... త్వరలో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ఉన్నాయని, ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.

తమ ఓటమిని ముందే గ్రహించిన బీజేపీ సీనియర్లు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పద్దెనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల పాపాలను కడిగేయాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
digvijay singh
Congress
Madhya Pradesh

More Telugu News