Kapil Dev: నోరు, చేతులు కట్టేసిన స్థితిలో కపిల్‌దేవ్‌.. వీడియో వైరల్‌.. అసలు విషయం ఇదీ!

Video of kapil Dev Shared by gautam gambhir goes viral on social media
  • క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ వీడియో షేర్ చేసిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్
  • కపిల్ దేవ్ చేతులు కట్టేసి కిడ్నాప్ చేసినట్టు ఉన్న వీడియో
  • ఈ షాకింగ్ దృశ్యాలతో నెట్టింట కలకలం 
  • అది కపిల్ నటించిన యాడ్ అని తెలిసి పడిపడీ  నవ్వుకున్న నెటిజన్లు
క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌ను కిడ్నాప్ చేశారా? అంటూ గౌతం గంభీర్ నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. కపిల్ కిడ్నాప్ అవ్వడమేంటి? అంటూ అనేకమంది ఆశ్చర్యపోయారు. వీడియోలో కపిల్‌‌దేవ్‌ నోటికి కర్చీఫ్, చేతులకు తాళ్లు కట్టి ఇద్దరు వ్యక్తులు బలవంతంగా గదిలోకి తీసుకెళుతున్నట్టు కనిపించింది. దీంతో, ఈ వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ‘‘ఈ వీడియో మీక్కూడా వచ్చిందా? ఈ వ్యక్తి కపిల్ దేవ్ కాకూడదని కోరుకుంటున్నా. ఆయన క్షేమంగానే ఉన్నారని భావిస్తున్నా’’ అంటూ గౌతం గంభీర్ చేసిన కామెంట్ మొత్తం వ్యవహారాన్ని మరింత రక్తి కట్టించింది. 

అయితే, అది కపిల్ దేవ్ నటించిన యాడ్‌లోని క్లిప్ అని తెలుసుకున్నాక జనాలు పడిపడీ నవ్వుకుంటున్నారు. కపిల్ అభిమానులు తొలుత కాస్తంత టెన్షన్ పడ్డా ఆ తరువాత విషయం తెలిశాక వాళ్లూ ఎంజాయ్ చేశారు. నెటిజన్లను ఈ వీడియో అమితంగా ఆకట్టుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది.
Kapil Dev
Gautam Gambhir
Viral Videos

More Telugu News