Uttar Pradesh: పట్టాలపై నుంచి ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన రైలు.. తప్పిన పెను ప్రమాదం

Train Climbs Up Platform In UPs Mathura Railway Station
  • ఉత్తరప్రదేశ్‌లోని మధుర రైల్వే స్టేషన్‌లో ఘటన
  • ప్రయాణికులు దిగి వెళ్లిపోయిన తర్వాత అకస్మాత్తుగా ప్లాట్‌ఫాం ఎక్కేసిన రైలు
  • దర్యాప్తు చేస్తున్నామన్న అధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని మధుర రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి పొద్దుపోయాక ఓ రైలు ఉన్నట్టుండి ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. అయితే, అప్పటికే ప్రయాణికులు ప్లాట్‌ఫాం వీడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

మధుర స్టేషన్ డైరెక్టర్ ఎస్‌కే శ్రీవాస్తవ కథనం ప్రకారం.. షుకుర్ బస్తీ నుంచి వచ్చిన ఈఎంయూ రైలు రాత్రి 10.49 గంటల సమయంలో మధుర స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు దిగి వెళ్లిపోయిన తర్వాత రైలు ఒక్కసారిగా ప్లాట్‌ఫాం పైకి ఎక్కేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

అంత ఎత్తున్న ప్లాట్‌ఫాంపైకి రైలు ఎలా ఎక్కిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన కొన్ని రైళ్లకు ఆటంకం ఏర్పడింది.
Uttar Pradesh
Mathura Railway Station
Train Accident

More Telugu News