Balineni Srinivasa Reddy: బాలినేనికి షాకిచ్చిన వైసీపీ హైకమాండ్

YSRCP suspends Balineni followers
  • బాలినేని అనుచరులను సస్పెండ్ చేసిన అధిష్ఠానం
  • తనకు తెలియకుండానే సస్పెండ్ చేశారని బాలినేని అసహనం
  • సీఎం జగన్ ను కలిసే యోచనలో బాలినేని
సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ హైకమాండ్ షాకిచ్చింది. ఆయన ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బాలినేనికి సమాచారం ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. 48 గంటల్లో తన అనుచరులను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఈ అంశంపై బాలినేని చర్చించే అవకాశం ఉందని చెపుతున్నారు.
Balineni Srinivasa Reddy
Jagan
YSRCP

More Telugu News