Undavalli Arun Kumar: చంద్రబాబు కేసులో సీబీఐ విచారణ జరపాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్
- ఏపీ హైకోర్టులో పిల్ వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్
- చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వచ్చిన పిటిషన్
- మరో బెంచ్ కు బదిలీ చేయాలని సీజే ఆదేశం
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఏపీ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ వేశారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకు వచ్చింది. పిటిషన్ ను హైకోర్టు రిజిస్ట్రీ చీఫ్ జస్టిస్ బెంచ్ కు కేటాయించింది. అయితే, ఈ పిల్ ను విచారించేందుకు తమ ఇద్దరు జడ్జిల్లో ఒకరికి అభ్యంతరం ఉందని చీఫ్ జస్టిస్ తెలిపారు. వెంటనే పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు.
మరోవైపు, స్కిల్ డెవలప్ మెంట్ కేసు పరిధి చాలా ఎక్కువగా ఉందని పిటిషన్ లో ఉండవల్లి పేర్కొన్నారు. నిధులను పక్కదారి పట్టించేందుకు ఇతర ప్రాంతాల్లో షెల్ కంపెనీలు ఏర్పాటయ్యాయని చెప్పారు. గుట్టు బయట పడాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని తెలిపారు. సీబీఐ దర్యాప్తులోనే నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.