Naseeruddin Shah: ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా షాకింగ్ కామెంట్స్

Naseeruddin Shah REVEALS he couldnt sit through RRR and Pushpa
  • ఈ సినిమాలు చూసేందుకు ప్రయత్నించానని, కానీ అంతసేపు కూర్చోలేకపోయానని వెల్లడి
  • మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ చూశానని వెల్లడి
  • మణిరత్నం అజెండాలేని దర్శకుడు అన్న నసీరుద్దీన్ షా
అవార్డులు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల గురించి బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలు చూసేందుకు ప్రయత్నించానని, కానీ అంతసేపు కూర్చోలేకపోయానన్నారు. హైపర్ మాస్కులినిటీని చిత్రీకరించడం వల్ల  రెండు చిత్రాలను తాను చూడలేకపోయానన్నారు. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు చూడలేకపోయానని, కానీ మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ చూశానని తెలిపారు. మణిరత్నం అజెండా లేని దర్శకుడు అన్నారు. ఈ సినిమాలు చూడటం ద్వారా ప్రేక్షకులు ఏమి పొందుతారో తాను ఊహించలేనన్నారు. 

తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ పరిశ్రమల నుంచి వస్తోన్న హిందీలో చేసిన సినిమాల కంటే ఊహాజనితంగా, అసలైనవిగా ఉంటాయని గతంలో నసీరుద్దీన్‌షా అన్నారు. ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, గదర్ చిత్రాల విజయంపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Naseeruddin Shah
RRR
Pushpa
Allu Arjun

More Telugu News