Shivarajkumar: జూనియర్ ఎన్టీఆర్ అంటే మా కుటుంబంలో అందరికీ ఇష్టమే: శివరాజ్ కుమార్

Shivaraj Kumar opines on Jr NTR and his fans in a live chat
  • 'ఘోస్ట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కన్నడ శివరాజ్ కుమార్
  • అక్టోబరు 19న ఘోస్ట్ రిలీజ్
  • సోషల్ మీడియాలో అభిమానులతో శివరాజ్ కుమార్ లైవ్ చాట్
  • లైవ్ చాట్ లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్
కన్నడ అగ్ర కథనాయకుడు శివరాజ్ కుమార్ నటించిన 'ఘోస్ట్' చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ భారీ చిత్రం అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో శివరాజ్ కుమార్ అభిమానులతో సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ చాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఓ ప్రశ్న అడిగారు. 

"హాయ్ శివణ్ణ సర్... మేం తారక్ అభిమానులం.. మీ కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తాం. మా ప్రశ్న ఏంటంటే... జూనియర్ ఎన్టీఆర్ ఎంతో చక్కగా కన్నడ భాషలో మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? కర్ణాటకలోని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి కూడా ఏదైనా చెప్పండి!" అని కోరారు. 

అందుకు శివరాజ్ కుమార్ స్పందించారు. "కన్నడ మాట్లాడాలంటే విశాల హృదయం ఉండాలి. ఆ విశాల హృదయం జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది. అతడు కన్నడలో మాట్లాడడమే కాదు, ఓ పాట కూడా పాడాడు. మా కుటుంబంలో అందరం జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానిస్తాం. అతడికెప్పుడూ మంచి జరగాలని కోరుకుంటాం. తారక్ అభిమానులంటే మాకూ ఇష్టమే" అని వివరించారు.
Shivarajkumar
Ghost
Live Chat
Jr NTR
Kannada
Karnataka

More Telugu News