Nara Lokesh: ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు

Nara Lokesh files anticipatory bail petitions in Skill Development and Fernet cases
  • పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని కోరిన లోకేశ్
  • పిటిషన్లు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం
  • స్కిల్ కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ లను వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో కూడా నారా లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లో ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును లోకేశ్ కోరారు. ఈ పిటిషన్లు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 21 రోజులుగా ఆయన జైల్లో వున్నారు. 
Nara Lokesh
Telugudesam
Skill Development Case
AP Fibernet Case
AP High Court

More Telugu News