Tamilnad Mercantile Bank: డ్రైవర్ ఖాతాలో రూ.9,000 కోట్లు.. బ్యాంక్ సీఈవో రాజీనామా
- తమిళనాడు మర్కంటైల్ బ్యాంకుల్లో పొరపాటు లావాదేవీ
- వారం క్రితం క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9,000 కోట్లు జమ
- అరగంటలోనే తిరిగి ఉపసంహరించుకున్న బ్యాంక్
- రాజీనామా సమర్పించిన బ్యాంక్ ఎండీ, సీఈవో
ఒక పెద్ద పొరపాటు ఏకంగా సంస్థ అధినేత రాజీనామాకు దారితీసింది. చెన్నైకి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో పొరపాటున రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (టీఎంబీ) లో ఈ ఘటన జరిగింది. చెన్నైకి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజ్ కుమార్ కు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లో ఖాతా ఉంది. పొరపాటున అతడి ఖాతాలో వారం క్రితం రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. అది చూసి రాజ్ కుమార్ ఆశ్చర్యపోయాడు. దాన్ని నిజం అని నమ్మకుండా, స్కామ్ అని అనుమానించాడు.