simultaneous polls: 2024లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదన్న లా కమిషన్!

No simultaneous polls in 2024 say Law Commission sources

  • పూర్తి నివేదికకు సమయం పడుతుందన్న న్యాయ కమిషన్ అధ్యక్షుడు
  • ప్రస్తుతం నివేదిక తయారీ ప్రక్రియ సాగుతోందని వెల్లడి
  • సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని వెల్లడి

2024లో ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు సాధ్యంకాదని లా కమిషన్ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. జమిలి నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని న్యాయ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రితు రాజ్ అవస్థి వెల్లడించారు. పూర్తి నివేదికకు కొంత సమయం అవసరమన్నారు. ప్రస్తుతం నివేదిక తయారీ ప్రక్రియ జరుగుతోందన్నారు.

మరోవైపు, జమిలి నిర్వహణకు రాజ్యాంగపరమైన సవరణలు చేయాలని లా కమిషన్ తన నివేదికలో సూచించనుందని ఆ వర్గాల సమాచారం. జమిలి ఎన్నికల నిర్వహణపై 2022 డిసెంబర్ 22న లా కమిషన్ ఆరు ప్రశ్నలను జాతీయ రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల కమిషన్, బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు, నిపుణుల ముందు ఉంచింది. దీనిపై ప్రస్తుతం కసరత్తు జరుపుతున్న లా కమిషన్, 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు తమ నివేదకను పబ్లిష్ చేయనుందని, కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు సమర్పించనుందని వార్తలు వస్తున్నాయి.

అంతకంటే ముందు 2018లోనూ 21న లా కమిషన్ ముసాయిదా నివేదికను కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు సమర్పించింది. లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని, అడ్మినిస్ట్రేషన్ పైన, భద్రతాదళాల పైన భారం తగ్గుతుందని, ప్రభుత్వ పథకాలు మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు వీలవుతుందని పేర్కొంది. 

  • Loading...

More Telugu News