Shivaraj Kumar: ఓ వ్యక్తిగా రామ్ చరణ్ మేలిమి వజ్రంలాంటి వాడు: శివరాజ్ కుమార్

Shivaraj Kumar describes Ram Charan absolute gem of a person
  • ఘోస్ట్ చిత్రంలో నటించిన శివరాజ్ కుమార్
  • అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
  • సోషల్ మీడియా చాట్ లో శివణ్ణను పలకరించిన రామ్ చరణ్ ఫ్యాన్స్
  • రామ్ చరణ్ ఎంతో వినయశీలి అని కితాబు
కన్నడ అగ్రహీరో శివరాజ్ కుమార్ అభిమానులతో చిట్ చాట్ ను ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. ఆస్క్ నమ్మ శివణ్ణ హ్యాష్ ట్యాగ్ తో ఆయన ఈ చాట్ నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ చాట్ లో శివరాజ్ కుమార్ ను పలకరించారు. 

"రామ్ చరణ్ తో మీ స్నేహ సంబంధాలు ఎలాంటివి? రామ్ చరణ్ నటించిన చిత్రాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది?" అని ప్రశ్నించారు. అందుకు శివరాజ్ కుమార్ స్పందించారు. 

"రామ్ చరణ్ ఓ వ్యక్తిగా మేలిమి వజ్రం లాంటి వాడు. ఓ నటుడిగా అతడు అమోఘం. ప్రపంచవ్యాప్తంగా ఆదరాభిమానాలు పొందుతున్నప్పటికీ ఎంతో వినయవిధేయతలతో నడుచుకుంటాడు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ నటన అద్భుతం... కానీ అతడి చిత్రాల్లో మగధీర నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చుతుంది" అని వివరించారు. శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. తన సినిమాకు వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయాలని భావిస్తూ, సోషల్ మీడియాలో చాటింగ్ చేపట్టారు.
Shivaraj Kumar
Ram Charan
Chat
Fans
Ghost
Kannada

More Telugu News