Smartphone: అతిగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? ఈ వ్యాధిని ఆహ్వానించినట్టే!

Smartphone Vision Syndrome threat for Spending Hours On Phone people

  • ప్రజల జీవితాల్లో భాగమైన స్మార్ట్‌ఫోన్
  • అతిగా వాడితే స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ ముప్పు
  • దీని వల్ల కంటి చూపును కోల్పోయే ప్రమాదం

కొన్నేళ్ల నుంచి స్మార్ట్ ఫోన్ ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిపోయారు. ఐదు నిమిషాలు ఫోన్ పక్కన లేకుంటే ఏదో కోల్పోయినట్టు భావిస్తున్నారు. అన్ని అవసరాలకూ స్మార్ట్ ఫోన్లను వాడుతున్న జనాలు అవసరం లేకపోయినా కూడా ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఇలాంటి వారికి ఓ వ్యాధి ముప్పు ఉంది. అతిగా ఫోన్‌ను వాడటం వల్ల ‘స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్’ కు గురవుతున్నారు. ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ వాడుతుంటే కంటికి సంబంధించిన సమస్యలు మొదలవుతాయి.

కంటిమీద పెరిగే ఒత్తిడి స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ సమస్యకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది కంటిచూపు పోవడానికి కూడా కారణం అవుతుంది. చిన్నపిల్లల కళ్లు సున్నితంగా ఉంటాయి కాబట్టి వారిపై అధిక ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే చిన్నతనంలోనే కంటి చూపునకు సంబంధించి సమస్యలను ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లను అదే పనిగా వాడటం మానేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

  • Loading...

More Telugu News