YS Bhasker Reddy: కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నా.. బెయిల్ పొడిగించండి: వైఎస్ భాస్కర్ రెడ్డి

YS Bhasker Reddy filed petition for Bail Extention
  • కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన భాస్కర్ రెడ్డి
  • ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని కోర్టుకు విజ్ఞప్తి
  • ఈ నెల 3న విచారణ చేపడతామన్న న్యాయస్థానం
ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని కోరుతూ వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో విశ్రాంతి అవసరమని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ పొడిగించాలని కోరారు. వైద్యుల సూచనలు, తదుపరి చికిత్సల దృష్ట్యా మరో రెండు నెలల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈ నెల 3న విచారించనున్నట్లు పేర్కొంది. కాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే! ఈ కేసులో అక్టోబర్ 3 (మంగళవారం) వరకు భాస్కర్ రెడ్డికి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు సమీపిస్తుండడంతో వైఎస్ భాస్కర్ రెడ్డి మరోమారు కోర్టును ఆశ్రయించారు.
YS Bhasker Reddy
Escart Bail
YS Vivekananda Reddy
viveka murder case

More Telugu News