TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. 28న శ్రీవారి ఆలయం మూసివేత
- 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం
- 28న రాత్రి 7.05 ఆలయం మూసివేత
- తిరిగి 29 తెెల్లవారుజామున 3.15 గంటలకు తెరుచుకోనున్న ఆలయ తలుపులు
- నేడు ఎస్ఎస్డీ టోకెన్ల రద్దు
ఈ నెలలో తిరుమల ప్లాన్ చేసుకునే భక్తులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటలపాటు మూతపడనుంది. 29న తెల్లవారుజామున 1.05 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 2.22 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ కాబట్టి 28న రాత్రి 7.05 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
తిరిగి 3.15 గంటలకు శుద్ధి చేసి సుప్రభాత సేవల అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. ఆ తర్వాతి నుంచి యథావిధిగా భక్తులను అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో సహస్ర దీపాలంకార సేవ, దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనం 28న రద్దు చేశారు. అలాగే, పెరటాసి రద్దీ కారణంగా నేడు ఎస్ఎస్డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది.