Vijayasai Reddy: త్వరలోనే టీడీపీ రెండు, మూడు ముక్కలు కాబోతోంది: విజయసాయిరెడ్డి

TDP will split in to three very soon says Vijayasai Reddy
  • పార్టీ అధినేత జైలు పాలైనా ఆ పార్టీ శ్రేణులు పట్టించుకోవడం లేదన్న విజయసాయి
  • ఇది ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా
  • ఆ పార్టీకి మద్దతిస్తున్న బలమైన వ్యాపారవర్గంలో పునరాలోచన మొదలయిందని వ్యాఖ్య
టీడీపీని ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆ పార్టీ రెండు, మూడు ముక్కలు కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ఆ పార్టీ అధినాయకుడు కరప్షన్ కేసులో జైలు పాలైనా... పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోందని అన్నారు. 40 ఏళ్లుగా పార్టీకి మద్దతిస్తున్న బలమైన వ్యాపారవర్గంలో కూడా పునరాలోచన మొదలయిందని... ఆయన దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
Vijayasai Reddy
YSRCP
Telugudesam

More Telugu News