Agasara Nandini: ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన తెలంగాణ బిడ్డ అగసర నందిని... "ట్రాన్స్ జెండర్" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన తోటి అథ్లెట్ స్వప్న

Indian athlete Swapna Barman makes severe comments after Agasara Nandini won bronze in Asian Games
  • చైనాలోని హాంగ్ జౌ నగరంలో ఆసియా క్రీడలు
  • హెప్టాథ్లాన్ క్రీడాంశంలో కాంస్యం సాధించిన అగసర నందిని
  • త్రుటిలో కాంస్యం చేజార్చుకున్న స్వప్న బర్మన్
  • ట్రాన్స్ జెండర్ కారణంగా పతకం కోల్పోయాన్న స్వప్న
చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో తెలంగాణకు చెందిన అగసర నందిని హెప్టాథ్లాన్ ఈవెంట్ లో కాంస్యం చేజిక్కించుకుంది. ఈ క్రీడాంశంలో నందిని 57.12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. 

అయితే, ఇదే ఈవెంట్ లో భారత్ కు చెందిన మరో అథ్లెట్ స్వప్న బర్మన్ 57.08 పాయింట్లు సాధించి త్రుటిలో పతకం చేజార్చుకుంది. దాంతో, స్వప్న బర్మన్... అగసర నందినిపై అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాను ఒక 'ట్రాన్స్ జెండర్' కారణంగా కాంస్య పతకాన్ని కోల్పోయానని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే, ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో స్వప్న వెంటనే తన పోస్టును సోషల్ మీడియా నుంచి తొలగించింది. కానీ అప్పటికే ఆమె వ్యాఖ్యలు మీడియాకెక్కాయి. 

ఈ నేపథ్యంలో, తోటి అథ్లెట్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు స్వప్న బర్మన్ మూల్యం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర అథ్లెట్లను విమర్శించడం, ఆరోపణలు చేయడం అథ్లెటిక్స్ కమిషన్ నియమావళికి విరుద్ధం. దాంతో ఆమెపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.
Agasara Nandini
Swapna Barman
Bronze
Heptathlon
Asian Games

More Telugu News