Hyderabad: చిలుక కనిపించడం లేదని జూబ్లీహిల్స్ వ్యాపారి ఫిర్యాదు.. ఒక్క రోజులో వెతికితెచ్చిన పోలీసులు

Lost australia parrot returned to owner in a day by jubilee hills police

  • రూ.1.30 లక్షల విలువైన ఆస్ట్రేలియా చిలుక పోయిందని జూబ్లీహిల్స్ వ్యాపారి ఫిర్యాదు
  • చిలుక ఫొటోను స్థానిక పెట్ షాపు నిర్వాహకులకు పంపించిన పోలీసులు
  • ఆ చిలుక అమ్మకానికి ఉందని ఓ వ్యక్తి పెట్టిన వాట్సాప్ స్టేటస్‌తో జాడ లభ్యం
  • పెట్ షాప్ నిర్వాహకుడు ఇచ్చిన సమాచారంతో చిలుకను స్వాధీనం చేసుకున్న వైనం

తన చిలుక ఎక్కడికో ఎగిరిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తికి అతడి చిలుకను ఒక్క రోజులో జూబ్లీహిల్స్ పోలీసులు పట్టితెచ్చి ఇచ్చారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, నరేంద్రాచారి మైరు అనే వ్యాపారి రోడ్ నెం. 44లో నివసిస్తుంటారు. ఆయన బిస్ట్రో కాఫీ షాపు నిర్వహిస్తుంటారు. ఇటీవల ఆయన ఆస్ట్రేలియాకు చెందిన రాక్టో అనే 4 నెలల వయసున్న చిలుకను రూ.1.30 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. కానీ సెప్టెంబర్ 22న చిలుకకు ఆహారం పెట్టేందుకు బోను తలుపు తీయగా అది హఠాత్తుగా ఎగిరిపోయింది. 

సెప్టెంబర్ 24న నరేంద్రాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలుక ఫొటో కూడా వారికి ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫొటోను స్థానిక పక్షులు, జంతువుల విక్రయదారులకు పంపించారు. అయితే, అప్పటికే ఈ చిలుక రెండు సార్లు చేతులు మారింది. మూడోమారు ముజీబ్ అనే వ్యక్తి రూ.70 వేలకు చిలుకను అమ్మకానికి పెట్టాడు. చిలుక ఫొటోను వాట్సాప్ స్టేటస్‌‌లో పెట్టాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ పెట్ షాపు యజమాని ఈ విషయాన్ని  ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతోతెలియజేయడంతో వారు చిలుకను స్వాధీనం చేసుకున్నారు. 

  • Loading...

More Telugu News