Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
- వర్చువల్గా వాదనలు వినిపించిన చంద్రబాబు న్యాయవాది లూథ్రా
- సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా టీడీపీ అధినేత తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్గా వాదనలు వినిపించారు. అనంతరం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఏజీ శ్రీరామ్ వాదనలకు లూథ్రా కౌంటర్ వాదనలు కూడా వినిపించారు. రాజకీయ దురుద్దేశ్యంతో సీఐడీ కేసు నమోదు చేసిందని కోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.