Manickam Tagore: కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న విషయం మోదీ వ్యాఖ్యలతో నిజమని తేలింది: మాణికం ఠాగూర్

Manickam Tagore responds to PM Modi comments about CM KCR
  • జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిశారన్న ప్రధాని మోదీ
  • ఇన్నాళ్లుగా ఇది రహస్యంగా ఉందని వెల్లడి
  • కేటీఆర్ ను ఆశీర్వదించాలని కూడా కేసీఆర్ కోరారని స్పష్టీకరణ
  • మోదీ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు
  • ఇదే విషయాలను రేవంత్ రెండేళ్లుగా చెబుతున్నారన్న మాణికం ఠాగూర్
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ తనను కలిశారని ప్రధాని మోదీ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుగా ఈ విషయం రహస్యంగా ఉందని మోదీ తెలిపారు. కేటీఆర్ ను ఆశీర్వదించాలని కూడా కేసీఆర్ తనను కోరారని ప్రధాని వివరించారు. దీనిపై రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న సంగతి మోదీ వ్యాఖ్యలతో బట్టబయలైందని తెలిపారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజమని తేలిందని పేర్కొన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ కోరుకున్నది నిజం అని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రెండేళ్లుగా ఇదే విషయం చెబుతున్నారని వెల్లడించారు.
Manickam Tagore
Narendra Modi
KCR
KTR
Revanth Reddy
Congress
BJP
BRS
Telangana

More Telugu News