Britain Visa: విద్యార్థులకు భారంగా పెరిగిన యూకే వీసా ధరలు.. నేటి నుంచే అమల్లోకి
- విజిటింగ్, స్టూడెంట్ వీసా ధరలను పెంచిన బ్రిటన్
- రూ. 50,428కి పెరిగిన స్టూడెంట్ వీసా ధరఖాస్తు
- రూ.11,835కు చేరుకున్న విజిటింగ్ వీసా ధరఖాస్తు రుసుము
- 15 నుంచి 20 శాతం పెరిగిన వీసా ధరలు
పెరిగిన యూకే స్టూడెంట్, విజిటింగ్ వీసాల రుసుము నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆరు నెలలలోపు విజిటింగ్ వీసా రుసుము గతంలో 100 పౌండ్లు ఉంటే ఇప్పుడు అది 115 పౌండ్లకు పెరిగింది. విద్యార్థి వీసా రుసుము గతంలో 363 పౌండ్లు ఉండగా దానిని 490 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
భారత కరెన్సీ లెక్కల్లో చూసుకుంటే తాజా పెంపుతో విజిటింగ్ వీసా దరఖాస్తు ఫీజు రూ. 11,835, స్టూడెంట్ వీసా దరఖాస్తు రుసుము రూ. 50,428కి పెరిగింది. పెరిగిన ధరలు భారత విద్యార్థులపై ఆర్థికభారం మోపనున్నాయి. పెరిగిన వీసాల ధరలు అక్టోబరు 4 నుంచి అమల్లోకి వస్తాయని బ్రిటన్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో వర్క్, విజిటింగ్ వీసాల ధరలలో 15 శాతం, ప్రాధాన్య, స్టడీ, స్పాన్సర్‌షిప్ వీసాల ధరల్లో 20 శాతం పెరుగుదల ఉంటుందని తెలిపింది.