Pakistan: మైదానంలో మా బద్ధకానికి కారణం హైదరాబాద్ బిర్యానీయే: పాకిస్థాన్ వైస్ కెప్టెన్

We have been having Biryani daily and that is why we are a bit slow in the field says Shadab khan
  • ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు
  • ఉప్పల్ స్టేడియంలో వార్మప్‌ మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్‌లో తడబడ్డ పాక్‌
  • రోజూ బిర్యానీ తింటున్నామని చెప్పిన షాదాబ్‌ ఖాన్
వన్డే ప్రపంచ కప్‌ కోసం ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగు పెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. మరో రెండు ప్రధాన మ్యాచ్‌లను కూడా ఇక్కడే ఆడనుంది. చాలా ఏళ్ల తర్వాత మన దేశానికి వచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లకు హైదరాబాద్‌లో అద్భుత ఆతిథ్యం లభిస్తోంది. నగరంలో అగ్ర హోటళ్లలో ఒకటైన పార్క్‌ హయత్‌లో పాక్‌ క్రికెటర్లకు బస ఏర్పాటు చేశారు. అక్కడ దాయాది జట్టు ఆటగాళ్లకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రపంచంలోనే ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీ పాక్‌ ఆటగాళ్లకు మరింత నచ్చింది. 

దాంతో రోజూ బిర్యానీ లాగిస్తున్నామని పాకిస్థాన్ వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్ చెప్పాడు. అందుకే మైదానంలో తాము అంత చరుగ్గా ఉండలేకపోతున్నామని తెలిపాడు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు పలు క్యాచ్‌లను వదిలేయడంతో పాటు మిస్‌ ఫీల్డ్‌ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే, మైదానంలో తాము నిదానంగా ఉండటానికి పరోక్షంగా హైదరాబాద్‌ బిర్యానీనే కారణమని షాదాబ్‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ తర్వాత వ్యాఖ్యానించాడు.
Pakistan
World Cup
Hyderabad
uppal
biryani

More Telugu News