OnePlus 11R: అమెజాన్ లో చాలా తక్కువ ధరకే వన్ ప్లస్ 11 ఆర్

OnePlus 11R deal revealed price will effectively drop to Rs 34999 in Amazon
  • రూ.39,999కు విక్రయించనున్న అమెజాన్
  • దీనిపై రూ.3,000 కూపన్ డిస్కౌంట్
  • ఎస్ బీఐ కార్డ్ తో కొంటే మరో రూ.2,000 డిస్కౌంట్
  • ఫ్లిప్ కార్ట్ పై ఐఫోన్ 12 అమ్మకం ధర రూ.32,999
ఈ కామర్స్ వేదికలపై దసరా సందర్భంగా భారీ అమ్మకాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. సేల్ లో భాగంగా మెగా డీల్స్, ఆకర్షణీయమైన ఆఫర్లు కొన్నింటిని అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. 

వన్ ప్లస్ 11ఆర్ మోడల్ చాలా తక్కువ ధరకే రానుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో వన్ ప్లస్ 11ఆర్ ధరను రూ.39,999గా అమెజాన్ పోస్ట్ చేసింది. దీనిపై రూ.3,000 డిస్కౌంట్ కూపన్ కూడా ఉంది. దీన్ని సెలక్ట్ చేసుకున్న వెంటనే ధర రూ.36,999కు తగ్గిపోతుంది. ఆ తర్వాత ఎస్ బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రూ.34,999కు దీన్ని సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్ ఎక్సేంజ్ చేసుకునే వారికి ఈ ధర ఇంకాస్త తగ్గనుంది.

అమెజాన్ పోర్టల్ పై ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న వారికి ఈ నెల 7 నుంచే డీల్స్ ప్రారంభం అవుతాయి. సాధారణ వినియోగదారులతో పోలిస్తే ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందు యాక్సెస్ కు అవకాశం ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ అయితే ఐఫోన్ 12ను రూ.32,999కే అమ్మకానికి తీసుకురానుంది. శామ్ సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ రూ.29,999 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆకర్షణీయమైన డీల్స్ వివరాలను నేరుగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ప్లాట్ ఫామ్ నుంచి తెలుసుకోవచ్చు.
OnePlus 11R
deal revealed
lowest price
Amazon Great Indian festival

More Telugu News