Chandrababu: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ ప్రారంభం
- మరో 5 రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్
- చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దూబే
- ఈ కేసులోని ఇతర నిందితులందరికీ బెయిల్ మంజూరయిందన్న దూబే
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై వాదనలు ప్రారంభమయ్యాయి. మరో 5 రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ వేసింది. బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దూబే వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులోని ఇతర నిందితులందరికీ బెయిల్ మంజూరయిందని... 26 రోజులుగా చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారని, ఆయనకు కూడా బెయిల్ మంజూరు చేయాలని దూబే కోర్టును కోరారు. రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని, చంద్రబాబుకు సంబంధించిన ఆధారాలను కూడా సీఐడీ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికే ఈ పిటిషన్లపై విచారణ పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో... ఈరోజు కోర్టు కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉంది.