Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కు ఈడీ సమన్లు
- ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో రణబీర్ కు సమన్లు
- యాప్ ను రణబీర్ ప్రమోట్ చేస్తున్నారన్న ఈడీ
- ఇప్పటికే ఈ యాప్ పై ఈడీతో పాటు పలు రాష్ట్రాల పోలీసుల విచారణ
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కు ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 6న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆన్ లైన్ బెట్టింగ్ ను నిర్వహించే మహదేవ్ యాప్ ను రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నారని ఈడీ చెపుతోంది. యాప్ ప్రమోషన్స్ కోసం రణబీర్ డబ్బులు తీసుకున్నారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ యాప్ పై ఈడీతో పాలు పలు రాష్ట్రాల పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి రూ. 112 కోట్లను హవాలా మార్గంలో తరలించినట్టు ఈడీ ఆధారాలను సేకరించింది. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో మహదేవ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుక యూఏఈలో జరిగింది. ఈ వేడుకకు భాలీవుడ్ ప్రముఖులు టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, ఎల్లీ అవ్రామ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నష్రత్ భరూచా తదితులు హాజరయ్యారు. వీరిలో పలువురికి ఈడీ సమన్లు పంపించే అవకాశం ఉన్నట్టు సమాచారం.