Kotamreddy Sridhar Reddy: పోలీసుల కళ్లు గప్పి... ఆటోలో వీఆర్సీ సెంటర్‌కు చేరుకున్న కోటంరెడ్డి
- చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీ చేపట్టిన టీడీపీ, జనసేన, సీపీఐ
- అనుమతి లేదంటూ పోలీసుల నిరాకరణ
- ఉదయం నుంచి ముఖ్య నేతల గృహ నిర్బంధం
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గృహ నిర్బంధం చేసేందుకు వెళ్లిన పోలీసులు
- అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి మాగుంట లేఅవుట్‌లోని కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. టీడీపీ నిర్వహించే ర్యాలీకి ఆయన వెళ్లకుండా పోలీసులు నిలువరించే ప్రయత్నాలు చేశారు.
పోలీసుల గృహనిర్బంధం నుంచి తప్పించుకొని, అజ్ఞాతంలోకి వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత వీఆర్సీ సెంటర్‌లో ప్రారంభమైన ర్యాలీకి హాజరయ్యారు. ఆయన పోలీసుల నుంచి తప్పించుకొని, ఓ ఆటోలో ర్యాలీకి వచ్చారు. పలువురు ఇతర టీడీపీ నేతలు కూడా పోలీసుల నుంచి తప్పించుకొని ర్యాలీకి వచ్చారు. పది నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలి వచ్చారు. జనసేన, సీపీఐ ఈ ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపాయి. వీఆర్సీ సెంటర్ జగన్‌కు వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది.