Telangana Temples: తెలంగాణ దేవుళ్లకు ఐటీ షాక్.. రూ. 11 కోట్లు కట్టాలని కొమురవెల్లి మల్లన్న స్వామికి నోటీసులు!

Rs 11 Cr IT notices to Komuravelli Mallanna Temple

  • ఆదాయపు పన్ను కట్టాలంటూ ఆలయాలకు ఐటీ నోటీసులు
  • కొమురవెల్లి మల్లన్నకు రూ. 3 కోట్ల జరిమానా కూడా విధింపు
  • వేములవాడ, బాసర తదితర ఆలయాలకు కూడా నోటీసులు

తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు పంపించింది. ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి తొలి స్థానంలో ఉన్నారు. రూ. 8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో రూ. 3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వేములవాడ రాజన్న, బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఇంకా పలు దేవాలయాలకు కూడా నోటీసులు అందాయి. మరోవైపు ఆలయాలకు ఐటీ నోటీసులు అందడంపై భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంబించడం సమంజసం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News