Vijayasai Reddy: కాంగ్రెస్ కూటమితో నారా కుటుంబం సంప్రదింపులు: విజయసాయి రెడ్డి

I N D I A alliance members are constantly in touch with the Nara family
  • టీడీపీని ఇండియా కూటమి భాగస్వామిగా పేర్కొన్న వైసీపీ ఎంపీ
  • తెర వెనుక చర్చలు నిర్వహిస్తున్నారంటూ ట్వీట్
  • త్వరలోనే అధికారిక బంధం ఖరారవుతుందన్న విజయసాయి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని ఇండియా (ఐఎన్డీఏఐ) కూటమి భాగస్వామిగా పేర్కొన్నారు. టీడీపీని ఆత్మరక్షణలో పడేసే విధంగా విజయసాయిరెడ్డి గతంలోనూ పలు సంచలన ప్రకటనలు చేయడం తెలిసిందే. టీడీపీ త్వరలోనే రెండు మూడు ముక్కలు కాబోతోందంటూ ఇటీవలే ఆయన ప్రకటించడం తెలిసే ఉంటుంది. తాజాగా టీడీపీ గురించి ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టారు.

‘‘టీడీపీ స్పష్టంగా ఇండియా కూటమిలో భాగస్వామి. కాంగ్రెస్ ఎంపీ ఒకరు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసును టేకప్ చేశారు. ఇండియా కూటమి సభ్యులు నారా కుటుంబంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. తెర వెనుక నిర్వహించే చర్చలు త్వరలోనే అధికారిక బంధానికి దారితీయనున్నాయి’’ అని విజయసాయి రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు. ‘‘అందుకేనా సర్ ఢిల్లీ యాత్ర’’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మీరు ఎన్డీయే అలయెన్స్ కదా అంటూ మరొక యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.
Vijayasai Reddy
I N D I A alliance
Nara family
TDP
YCP

More Telugu News