CJI: దాడులు జరుగుతాయనే భయంతో పని చేస్తున్నాం: సీజేఐ చంద్రచూడ్ కు 15 మీడియా సంస్థల లేఖ

15 Media organisation writes letter to CJI saying journalists are working under threat
  • దర్యాప్తు సంస్థలను తమపై ఆయుధాలుగా ప్రయోగిస్తున్నారంటూ లేఖ
  • కొందరు జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడం లేదని విమర్శ
  • సోదాల పేరుతో వచ్చి ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ తమపై ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు 15 మీడియా సంస్థలు లేఖ రాశాయి. తమపై ప్రతీకార దాడులు జరుగుతాయనే భయంతో దేశంలోని చాలా మంది జర్నలిస్టులు భయంతో పని చేస్తున్నారని లేఖలో వారు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కొందరు జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడం లేదని... సోదాల పేరిట వారిని కట్టడి చేసేందుకు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

పాత్రికేయులు చట్టానికి అతీతంగా ఉండాలని తాము కూడా కోరుకోవడం లేదని... కానీ, పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య పునాదులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు. జర్నలిస్టులు నిజాలు మాట్లాడినప్పుడే పత్రికా స్వేచ్ఛ సురక్షితంగా ఉంటుందని చెప్పారు. న్యూస్ క్లిక్ ఆన్ లైన్ పోర్టల్ లో పని చేసే 46 మంది ఉద్యోగుల ఇళ్లలో కొన్ని రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు సోదాలు చేశారు. పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సీజేఐకి మీడియా సంస్థలు లేఖ రాశాయి.
CJI
Justice DY Chandrachud
15 Media Organisations
Letter

More Telugu News