Asian Games: భారత జెండాను విసిరిన అభిమాని.. కింద పడకుండా సూపర్ క్యాచ్‌ పట్టిన నీరజ్‌ చోప్రా

Neeraj Chopra Takes Stunning Catch To Prevent Indian Flag From Falling On Ground After Asian Games Gold
  • ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన నీరజ్‌
  • స్టాండ్స్‌ నుంచి త్రివర్ణ పతాకాన్ని అతనికి ఇచ్చిన అభిమాని
  • జెండా కింద పడిపోతుండగా పట్టుకున్న నీరజ్
ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ విజేత, భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఆసియా క్రీడల్లోనూ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల జావెలిన్‌ త్రోలో తోటి భారత ఆటగాడు కిశోర్ కుమార్ జెనాను అధిగమిస్తూ చాంపియన్‌గా నిలిచాడు. కిశోర్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఒకే ఈవెంట్‌ లో స్వర్ణం, రజతం గెలిచిన అనంతరం ఈ ఇద్దరూ భారత త్రివర్ణ పతాకంతో స్టేడియంలో కలియతిరిగారు. 

ఈ సందర్భంగా స్టాండ్స్‌లోని ఓ అభిమాని నీరజ్‌ కోసం త్రివర్ణ పతాకాన్ని విసిరాడు. గాలికి అది పక్కకు వెళ్లి కింద పడిపోతుండగా నీరజ్‌ చాకచక్యంగా క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతీయ జెండా కింద పడకూడదన్న ఉద్దేశంతో నీరజ్‌ దాదాపు డైవ్‌ చేసినంత పని చేశాడు.
Asian Games
neeraj chopra
Indian flag
gold

More Telugu News