Rekha Naik: బీఆర్ఎస్ కు గుడ్ బై చెపుతున్నా: ఎమ్మెల్యే రేఖా నాయక్

MLA Rekha Naik resigning to BRS
  • రేఖా నాయక్ కు టికెట్ ఇవ్వని కేసీఆర్
  • కాంగ్రెస్ తో జరిపిన చర్చలు కూడా విఫలం
  • ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్ణయం
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఆమె గుడ్ బై చెప్పారు. రాజీనామాపై రేపు ప్రకటన చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతలతో ఆమె జరిపిన చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. మూడు విడతలుగా చర్చలు జరిపినప్పటికీ టికెట్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా తన అనుచరులతో చర్చలు జరిపిన రేఖా నాయక్... చివరకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
Rekha Naik
BRS

More Telugu News