Rea chakravarthy: బాధతీరేలా ఏడవడానికీ వీలు చిక్కలేదు: రియా చక్రవర్తి

Actor Rhea Chakraborty comments On Sushant singh rajputh
  • సుశాంత్ మరణంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానన్న నటి
  • తను లేకుండా జీవించడం చాలా కష్టమని వ్యాఖ్య
  • మనుషులం కాబట్టి ఏం జరిగినా ముందుకు సాగాల్సిందేనంటూ వేదాంత ధోరణి
బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై రియా చక్రవర్తి తాజాగా స్పందించారు. సుశాంత్ సన్నిహిత స్నేహితురాలిగా ఆయన మరణం తనకు తీరని లోటని చెప్పారు. సుశాంత్ లేకుండా జీవించడం చాలా కష్టమని అన్నారు. అయితే, మనమంతా మనుషులం కాబట్టి ముందుకు సాగక తప్పదని రియా చక్రవర్తి వేదాంత ధోరణిలో మాట్లాడారు. సుశాంత్ మరణించిన తర్వాత జరిగిన సంఘటనల గురించి ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో తనకు మనసులో బాధను దించుకునేలా ఏడ్చేందుకు కూడా సమయం దొరకనీయలేదని అన్నారు.

ఆప్తుడిని పోగొట్టుకున్న బాధ ఓవైపు, మీడియాలో తనను విలన్ గా చూపిస్తున్న బాధ మరోవైపు.. ఇలా చుట్టూ సమస్యలతోనే సతమతమయ్యానని వివరించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని రియా చెప్పారు. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని వివరించారు. తన తండ్రి భారత సైన్యంలో పనిచేశారని, ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోవద్దని, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలని చెప్పారని తెలిపారు. ఆ మాటలను గుర్తు తెచ్చుకుంటూ ధైర్యంగా నిలబడ్డానని రియా పేర్కొన్నారు.
Rea chakravarthy
Sushant Singh Rajput
Actor
suicide
Bollywood

More Telugu News