Pakistan: వరల్డ్ కప్: నెదర్లాండ్స్ పై తడబాటుకు గురైన పాక్ టాపార్డర్

Pakistan top order in troubles against Nederlands

  • వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్ × నెదర్లాండ్స్
  • టాస్ గెలిచి పాక్ కు బ్యాటింగ్ అప్పగించిన డచ్ జట్టు
  • 38 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకున్న పాక్
  • 5 పరుగులకే అవుటైన కెప్టెన్ బాబర్ అజామ్
  • పాక్ జట్టును ఆదుకున్న రిజ్వాన్, సాద్ షకీల్

టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్ లో ఇవాళ నెదర్లాండ్స్ తో తలపడుతోంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో పాక్ జట్టుకు ఇదే తొలి మ్యాచ్. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం ఈ పోరుకు వేదికగా నిలుస్తోంది. 

టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు నెదర్లాండ్స్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో తడబాటుకు గురైంది. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. లోగాన్ వాన్ బీక్, కోలిన్ అకెర్ మన్, పాల్ వాన్ మీకెరెన్ తలో వికెట్ తీశారు. 

ఫఖార్ జమాన్ 12, ఇమామ్ ఉల్ హక్ 15, కెప్టెన్ బాబర్ అజామ్ 5 పరుగులకే వెనుదిరగడంతో పాక్ కష్టాల్లో పడింది. అయితే, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్, సాద్ షకీల్ జోడీ పాక్ ను ఆదుకుంది. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు తీయించారు. ప్రస్తుతం పాక్ స్కోరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 101 పరుగులు. మహ్మద్ 38, సాద్ షకీల్ 28 పరుగులతో ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News