JP Nadda: రామోజీరావు దార్శనికుడు.. ప్రశంసల వర్షం కురిపించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.. ఫొటోలు ఇవిగో!

BJP Chief JP Nadda Met Ramoji Rao In Hyderabad Pic Went Viral
  • ఎన్నికల వేళ రామోజీతో నడ్డా భేటీ
  • సినిమా, మీడియా ప్రపంచానికి ఆయన చేసిన కృషి అసామాన్యమంటూ పొగడ్తలు
  • భేటీపై రాజకీయవర్గాల్లో చర్చ
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హైదరాబాద్‌లో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న వేళ రామోజీరావును ఇంటికి వెళ్లి మరీ కలవడం వెనక రాజకీయపరమైన కారణాలు ఉండే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఆయన వెంట బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ కూడా ఉన్నారు.
 రామోజీరావును కలిసిన విషయాన్ని నడ్డా స్వయంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా రామోజీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనో మార్గదర్శకుడని, దూరదృష్టి గలవారని కొనియాడారు. సినిమా, మీడియా ప్రపంచానికి ఆయన చేసిన కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని నడ్డా పేర్కొన్నారు.

JP Nadda
Ramoji Rao
Eenadu
Prakash Javadekar
BJP

More Telugu News