ICC World Cup: వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా, శ్రీలంక ఢీ... బ్యాటింగ్ లో డికాక్, డుస్సెన్ ధనాధన్
- ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
- 27 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 168 పరుగులు చేసిన సఫారీలు
భారత్ లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ పోరులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
అయితే, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ వాన్ డెర్ డుస్సెన్ దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. 27 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోరు 1 వికెట్ నష్టానికి 168 పరుగులు. డికాక్ 71 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు... డుస్సెన్ 86 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్ తో 80 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకుముందు, కెప్టెన్ టెంబా బవుమా రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. 8 పరుగులు చేసి బవుమా లంక మీడియం పేసర్ మధుషనక బౌలింగ్ లో వెనుదిరిగాడు.