Vijayasai Reddy: టీడీపీ ఆరిపోయే దీపమని మొత్తానికి సింబాలిక్‌గా చెప్పేశారు.. విజయసాయి సెటైర్

YCP Leader Vijayasai Reddy X against Chandrababu
  • చంద్రబాబుకు సంఘీభావంగా కాంతితో క్రాంతి కార్యక్రమం చేపట్టిన టీడీపీ
  • లైట్లు ఆర్పేసిన ఇళ్లు లెక్కపెడితే 2019లో వచ్చిన 23 సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రావని ఎద్దేవా
  • కొందరు నేతలు టపాసులు కూడా కాల్చారట అని సెటైర్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత తరచూ ఆ పార్టీని, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఎక్స్‌లో విరుచుకుపడ్డారు. 

చంద్రబాబుకు సంఘీభావంగా నిన్న టీడీపీ చేపట్టిన ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంతో టీడీపీ ఆరిపోయే దీపమని చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు. కాంతితో కాంత్రి కార్యక్రమంలో లైట్లు ఆపేసిన ఇళ్లను లెక్కవేసుకుంటే 2019లో వచ్చిన ఆ 23 సీట్లు కూడా 2024లో రావటగా! రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం తామెందుకు లైట్లు ఆర్పాలని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారటకదా అని అన్నారు. ఇంకొంతమంది నేతలు టపాసులు కూడా కాల్చారని, వారి ఆనందం వెనక వేరే అర్థం ఉందని అన్నారు. మొత్తానికి టీడీపీ ఆరిపోయే దీపమని సింబాలిక్‌గా మీరే చెప్పేశారని, ఏదైతో ఉందో.. నభూతో నభవిష్యత్.. అని పేర్కొన్నారు.
Vijayasai Reddy
Chandrababu Arrest
Skill Development Case
YSRCP
TDP

More Telugu News