Samantha: నాలుగేళ్ల తరువాత సింగర్ చిన్మయి రీఎంట్రీ.. సమంత ఫుల్ ఖుష్!

Samantha elated as chinmayee begins dubbing after 4 years of ban in Leo movie
  • విజయ్ హీరోగా నటిస్తున్న లియోలో త్రిష పాత్రకు చిన్మయి డబ్బింగ్
  • సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్న సింగర్
  • దాదాపు నాలుగేళ్ల నిషేధం తరువాత తొలిసారిగా డబ్బింగ్ చెబుతున్న చిన్మయి 
‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా తమిళ సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసి నిషేధానికి గురైన సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి దాదాపు నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓ సినిమాలో డబ్బింగ్ చెబుతున్నారు. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమా లియోలో త్రిష హీరోయిన్ పాత్రకు ఆమె డబ్బింగ్ చెబుతున్నారు. ఈ విషయాన్ని చిన్మయి స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకి అవకాశం ఇచ్చిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్, హీరో విజయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ అంశంపై వచ్చిన వార్తను నటి సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిన్మయి మళ్లీ డబ్బింగ్ చెబుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. సమంత, చిన్మయి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘ఏ మాయే చేశావే’లో సమంత చేసిన హీరోయిన్ పాత్రకు చిన్మయి డబ్బింగ్ చెప్పారు. ఆ తరువాత పలు హిట్ చిత్రాల్లోనూ సమంత పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. 

కాగా, ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా తమిళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల అంశాన్ని పేర్కొంటూ చిన్మయి అప్పట్లో డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధా రవిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సౌత్ ఇండియన్, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ చిన్మయిపై బ్యాన్ విధించింది.
Samantha
Chinmayi
Tollywood
Kollywood

More Telugu News