Virat Kohli: విరాట్ కోహ్లీకి సర్ ప్రైజ్ గిఫ్ట్

 Virat Kohli wins Gold medal by team for best fielding against Australia in Chennai
  • గోల్డ్ మెడల్ అందించిన ఫీల్డింగ్ కోచ్
  • ఇతర ఆటగాళ్లకు ప్రోత్సాహం ఇవ్వడం కీలకమని ప్రకటన
  • ఆస్ట్రేలియాపై విజయంలో కీలకంగా వ్యవహరించిన కోహ్లీ
వన్డే ప్రపంచకప్ 2023 లో తొలి మ్యాచ్ లోనే భారత్ ఆస్ట్రేలియాపై అపూర్వ విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బోణీ లేకుండానే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ క్రీజులో నిలదొక్కుకోగా, శ్రేయాస్ అయ్యర్ కూడా సున్నా పరుగుకే ఖాతా ముగించేశాడు. దీంతో కేెఎల్ రాహుల్ మైదానంలోకి ప్రవేశించాడు. కోహ్లీ, రాహుల్ కలసి భారత ఇన్నింగ్స్ ను బలంగా నడిపించి, విజయ తీరాలకు చేర్చారు. నిన్నటి విజయం పూర్తిగా కోహ్లీ, రాహుల్ కే దక్కుతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

దీంతో కోహ్లీకి భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. బంగారు పతకాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్ హ్యాండిల్ పై షేర్ చేసింది. ‘‘నేటి మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ సమయంలో చేసిన డైవింగ్ అద్భుతం. కానీ, మన జట్టులో ముఖ్యంగా స్థిరత్వం గురించి మాట్లాడుతుంటాం. కేవలం ఒక క్యాచ్ గురించి కాదు, మొత్తం మీద పనితీరు ఎలా ఉందన్నది ముఖ్యం. కేవలం మీ పనిని మాత్రమే చేయడం కాదు. జట్టులో ఇతర సభ్యులు మెరుగ్గా పనిచేసేలా ప్రోత్సహించడం ముఖ్యం. అందుకే ఇది విరాట్ కోహ్లీకి ఇది దక్కుతుంది’’ అని బంగారం మెడల్ అందిస్తూ దిలీప్ పేర్కొన్నారు.
Virat Kohli
wins
Gold medal
best fielding

More Telugu News