Vijayasai Reddy: చెల్లెమ్మా పురందేశ్వరీ.. మీకు అంత ప్రయాస ఎందుకు?: విజయసాయిరెడ్డి
- పురందేశ్వరి ఢిల్లీ పర్యటనపై విజయసాయి విమర్శలు
- రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల కోసం ఢిల్లీకి వెళ్తే బాగుండేదని వ్యాఖ్య
- అరెస్టై చంద్రబాబు కోసం అంత ప్రయాస ఎందుకని ఎద్దేవా
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీ పర్యటనపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'ఏపీకి రావాల్సిన ప్రాజెక్టుల కోసమో లేదా కనీసం మీ పార్టీ అభివృద్ధి కోసమో ఢిల్లీ యాత్రలు చేస్తే బాగుండేదేమో చెల్లెమ్మా పురందేశ్వరి' అని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి చేసి అరెస్టైన మీ బావ చంద్రబాబు కోసం ప్రయాస ఎందుకని అన్నారు. ఒక జాతీయ పార్టీలో ఉన్నానన్న కనీస స్పృహ లేకుండా మీరు చేస్తున్న డిమాండ్లను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు.