Renu Desai: ఆ పాత్ర ఇచ్చినందుకు వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే: రేణూ దేశాయ్

Renu Desai says she never thanked enough to director and producer for giving Hemalatha Lavanam role
  • రవితేజ ప్రధానపాత్రలో టైగర్ నాగేశ్వరరావు చిత్రం
  • అక్టోబరు 20న రిలీజ్
  • టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హేమలతా లవణంగా రేణూ దేశాయ్
  • రేణూ దేశాయ్ లుక్ కు విశేష స్పందన 
మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. దసరా సీజన్ కు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో రేణూ దేశాయ్ కూడా నటించారు. స్టూవర్ట్ పురంకు చెందిన పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. 

రేణూ దేశాయ్ ఈ చిత్రంలో... 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ సంఘసంస్కర్తగా పేరుగాంచిన హేమలతా లవణం పాత్రను పోషించారు. ఇటీవల హేమలతా లవణంగా రేణూ దేశాయ్ లుక్ ను చిత్రబృందం విడుదల చేయగా, విశేషమైన స్పందన వచ్చింది. 

దీనిపై రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. "నన్ను నమ్మి ఈ చిత్రంలో హేమలతా లవణం గారి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు వంశీకృష్ణ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ భయ్యాకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు" అని పేర్కొన్నారు.
Renu Desai
Hemalatha Lavanam
Tiger Nageswararao
Raviteja
Vamsi Krishna
Abhishek Agarwal

More Telugu News