Neftali Bennet: హమాస్‌పై నేరుగా యుద్ధంలో పాల్గొన్న ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్
- రిజర్వ్ ఆర్మీతో పాటూ యుద్ధంరంగంలో కాలుమోపిన ప్రధాని
- తోటి సైనికులతో ఆయన కరచాలనం చేస్తున్న దృశ్యాలు వైరల్
- హమాస్‌పై ఇజ్రాయెల్ ముప్పేట దాడి
- గాజా ప్రాంతానికి విద్యుత్ సరఫరా కట్, ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌తో ఇజ్రాయెల్ తరపున పోరాడేందుకు ఆ దేశ మాజీ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్ యుద్ధం రంగంలో కాలుపెట్టారు. మేజర్లయిన పౌరులందరూ నిర్ణీతకాలం పాటు సైన్యంలో ఇజ్రాయెల్‌కు సేవ చేయాలన్న నిబంధన మేరకు ఆయన కూడా సమరానికి సిద్ధమయ్యారు. సైనిక దుస్తులు ధరించిన ఆయన తోటి సైనికులతో కరచాలనం చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు, మిలిటెంట్ మూకలను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ ముప్పేట దాడి ప్రారంభించింది. మిలిటెంట్లు తలదాచుకున్న గాజా ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసింది. నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. గాజాపై బాంబుల వర్షం ప్రారంభించిన ఇజ్రాయెల్ సేనలు ఉగ్రస్థావరాలను నేలమట్టం చేస్తామంటూ భీషణ ప్రతిజ్ఞ చేశాయి. సామాన్యులు ఉగ్రస్థావరాలకు దూరంగా ఉండాలని సూచించాయి.