Cobra: షూ వేసుకునే ముందు ఓ సారి చెక్ చేసుకోండి..!
- నెటిజన్లకు ఐఎఫ్ఎస్ అధికారి సూచన
- షూలోకి దూరిన నాగుపాము వీడియో షేరింగ్
- వానా కాలంలో జాగ్రత్తగా ఉండాలంటూ పోస్ట్
పాములు కనిపించని ప్రదేశాల్లో నక్కి ఉంటాయి. అందుకే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవారు, పల్లెల్లోని వారు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. పాము కాటు కారణంగా ఏటా వేలాది మంది మరణిస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. చివరికి ఇంటి ముందు పెట్టిన షూని సైతం జాగ్రత్తగా పరిశీలించి కాళ్లకు వేసుకోవాలని ఇక్కడి వీడియో చూస్తే తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అవగాహన కల్పించే ఓ వీడియో క్లిప్ ను ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్ లో షేర్ చేశారు.