Rassmussen's disease: బాలికకు అరుదైన వ్యాధి.. మెదడులో సగ భాగం స్విచ్చాఫ్ చేసిన వైద్యులు!

Half of her brain switched off California doctors perform special surgery to save ailing girls life

  • అమెరికాలో ఆరేళ్ల బాలికకు రాస్‌ముసెన్స్ మెదడువాపు వ్యాధి
  • పరిస్థితి మరింతగా ముదిరితే అవయవాలు పనిచేయకుండా పోయే ప్రమాదం
  • మెదడులో సగభాగం తొలగించి చికిత్స చేద్దామనుకున్న వైద్యులు
  • భవిష్యత్తులో సమస్యలు రాకుండా మెదడులో ఓ భాగాన్ని నిద్రపుచ్చాలని నిర్ణయం
  • రెండు భాగాల మధ్య కనెక్షన్‌ను తెంచి విజయవంతంగా ఆపరేషన్

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆరేళ్ల అమెరికా బాలిక ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఆమె మెదడులోని సగభాగాన్ని నిద్రాణ స్థితిలోకి తీసుకెళ్లారు. రెండు సగభాగాల మధ్య సంబంధాన్ని తెంచి ఓ భాగాన్ని స్విచ్ఛాఫ్ చేశారు. కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్సిటీ హెల్త్ ఆసుపత్రిలో ఇటీవల ఈ ప్రత్యేక ఆపరేషన్ జరిగింది. 

చిన్నారి బ్రియానా బోడ్లీ రాస్‌ముసెన్స్ ఎన్‌సెఫెలైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి బాధితుల్లో మెదడు వాచిపోతుంది. పరిస్థితి ముదిరితే బాలిక అవయవాల్లో కదలికలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా వైద్యులు తొలుత బాలిక మెదడులోని సగ భాగాన్ని తొలగిద్దామనుకున్నారు. 

అయితే, భష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చిన్నారి మెదడులోని సగ భాగాన్ని పూర్తిస్థాయిలో నిద్రాణస్థితికి తీసుకెళ్లడమే మేలని భావించారు. ‘‘రెండు భాగాల మధ్య ఉన్న కనెక్షన్‌ను తెంచేశాం. దీంతో, వ్యాధి మెదడులోని ఇతర భాగాలకు వ్యాపించకుండా ఉంటుంది. ఆ తరువాత రోగం నయం అయిపోతుంది’’ అని ఈ ఆపరేషన్‌కు సారథ్యం వహించిన డా. ఆరన్ రాబిన్సన్ తెలిపారు.

  • Loading...

More Telugu News