Rohit Sharma: ఆఫ్ఘనిస్థాన్ పై రోహిత్ శర్మ సెంచరీ... మూడు రికార్డులు బద్దలు కొట్టిన హిట్ మ్యాన్

Rohit Sharma breaks three records

  • వరల్డ్ కప్ లో టీమిండియా × ఆఫ్ఘనిస్థాన్ 
  • మొదట 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసిన ఆఫ్ఘన్
  • తొలి వికెట్ కు 156 పరుగులు జోడించిన తిరుగులేని ఆరంభాన్నిచ్చిన రోహిత్, కిషన్
  • 63 బంతుల్లోనే సెంచరీ బాదిన హిట్ మ్యాన్

ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ అద్భుత శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. 

లక్ష్యఛేదనలో టీమిండియాకు తిరుగులేని ఆరంభం లభించింది. రోహిత్ శర్మ తన క్లాస్ ను చాటుకుంటూ కేవలం 63 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో ఇషాన్ కిషన్ కూడా రాణించడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. రోహిత్, ఇషాన్ కిషన్ జోడీ తొలి వికెట్ కు 18.4 ఓవర్లలోనే 156 పరుగులు జోడించి పటిష్ఠమైన పునాది వేసింది. 

ప్రస్తుతం భారత్ స్కోరు 23 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 194 పరుగులు. రోహిత్ శర్మ 129, కోహ్లీ 9 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా విజయానికి ఇంకా 79 పరుగులు కావాలి.

ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే...

  • 63 బంతుల్లోనే 100 పరుగులు... టీమిండియా తరఫున వరల్డ్ కప్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ వరల్డ్ కప్ లో 72 బంతుల్లో సెంచరీ చేశాడు.  
  • వరల్డ్ కప్ చరిత్రలో రోహిత్ శర్మకు ఇది 7వ సెంచరీ. వరల్డ్ కప్ లలో టీమిండియా తరఫున అత్యధిక సెంచరీలు చేసింది రోహిత్ శర్మే. ఇప్పటివరకు ఆ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ వరల్డ్ కప్ లలో 6 సెంచరీలు చేశాడు. 
  • నేటి మ్యాచ్ లో నవీనుల్ హక్ బౌలింగ్ లో రోహిత్ శర్మ కొట్టిన సిక్స్ తో క్రిస్ గేల్ రికార్డు తెరమరుగైంది. అంతర్జాతీయ క్రికెట్లో క్రిస్ గేల్ 553 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడా రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. 
  • అంతేకాదు, రోహిత్ శర్మ వరల్డ్ కప్ లలో 1000 పరుగుల మార్కును కూడా దాటాడు.

  • Loading...

More Telugu News