liver: ఈ సమస్యలు కనిపిస్తే మీ కాలేయం ఆరోగ్యంగా లేనట్టే!

Are you taking good care of your liver Signs that say you dont

  • ఆకలి వేయకపోయినా, ఇష్టమైనవి తినలేకపోతున్నా నిర్లక్ష్యం వద్దు
  • వికారం, వాంతులవుతున్నట్టు అనిపించినా అది కూడా సంకేతమే
  • చర్మంపై ఎర్రటి ర్యాషెస్, రక్తస్రావం సంకేతాలు కనిపించినా జాగ్రత్త పడాలి

కీలక విధులను నిర్వహించే కాలేయం పనితీరు, ఎన్నో కారణాల వల్ల గాడి తప్పొచ్చు. కాలేయం ఎప్పటికప్పుడు బైల్ ను ఉత్పత్తి చేస్తుంది. కొవ్వును శక్తిగా మారుస్తుంది. జీర్ణానికి బైల్ చాలా అవసరం. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపుతుంది. మన కాలేయ ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని చెప్పడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని చూసిన తర్వాత అయినా వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరం.

ఆకలి

రోజువారీ ఆకలి వేయడం సహజం. ఏదో ఒక రోజు కాస్త ఆకలి లేదనిపించినా వర్రీ అక్కర్లేదు. కానీ, చెప్పుకోతగ్గంత ఆకలి తగ్గితే దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. కాలేయం పనితీరు సక్రమంగా జరగడం లేదన్న దానికి ఇది ప్రాథమిక సంకేతం. ఉన్నట్టుండి ఆహారంలో మార్పులు, ఇష్టమైనవి కూడా తినలేకపోవడానికి జీర్ణశక్తి మందగించినట్టు అర్థం చేసుకోవాలి. దీని వెనుక కారణాన్ని కనుక్కోవాలి.

వికారం
తల తిరగడం, కడుపులో వికారం కామన్ అనుకోవద్దు. వీటికితోడు కండరాల నొప్పులు అనిపిస్తే కాలేయ ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిందే. కాలేయం వ్యర్థాలను బయటకు పంపుతుందని చెప్పుకున్నాం. ఈ పనిని సరిగ్గా చేయనప్పుడు వ్యర్థాలు పేరుకుపోయి వికారం, నొప్పులు అనిపిస్తాయి.

చర్మంపై రాషెస్
చర్మంపై రాషెస్ ఏర్పడొచ్చు. కాలేయంలో కొన్ని రకాల ప్రొటీన్లు పేరుకుపోయినప్పుడు అవి అక్కడి నుంచి రక్త ప్రవాహ మార్గంలోకి చేరి, చర్మాన్ని చేరుకుంటాయి. దీనివల్ల ఎండలోకి వెళ్లినప్పుడు చర్మంపై ర్యాషెస్ ఏర్పడతాయి.

పొత్తి కడుపు పై భాగంలో అసౌకర్యం
కుడిచేతి వైపు పొత్తి కడుపు పై భాగంలో అసౌకర్యంగా అనిపిస్తుంటే, అది కాలేయ ఇన్ ఫ్లమ్మేషన్ కు సూచిక. కొద్దిపాటి నొప్పి కూడా అనిపిస్తుంది. 

కళ్లు రంగు మారడం
కళ్లు పసుపు రంగులోకి మారడం కాలేయ అనారోగ్యానికి సంబంధించి సంకేతమే. బైలురూబిన్ ను కాలేయం సరిగ్గా ప్రాసెస్ చేయకపోవడం వల్ల అలా జరుగుతుంది. దీంతో బైలురూబిన్ శరీరమంతటా పేరుకుపోతుంది. 

మలం రంగులో మార్పులు
లైట్ బ్రౌన్ రంగులో మలం ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. కాలేయం విడుదల చేసిన బైల్ వల్ల ఈ రంగు ఏర్పడుతుంది. ఈ బైల్ సరిగ్గా ఉత్పత్తి కానప్పుడు పాలిపోయిన పసుపు రంగులో మలం వస్తుంటుంది. కనుక దీన్ని కూడా ఒక సూచన కిందే తీసుకోవాలి.

గాయాలు
రక్తం గట్టకట్టడానికి కావాల్సిన ముఖ్యమైన ప్రొటీన్లను కాలేయం తయారు చేస్తుంటుంది. కాలేయం పనితీరు మందగించినప్పుడు ఈ ప్రొటీన్ల విడుదల కూడా బలహీనపడుతుంది. దీంతో చిన్న పాటి గాయానికే రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. వంటిపై ఎక్కడైనా బ్లీడింగ్ అయి, నల్లగా అనిపిస్తుంటే అది కాలేయ పనితీరు గతి తప్పిందనడానికి సూచికగా తీసుకోవచ్చు.

  • Loading...

More Telugu News