Vijay Sai Reddy: బాబుకు బెయిల్ రాకపోయేసరికి అలజడి సృష్టించేందుకు టీడీపీ దుష్ప్రచారం: విజయసాయి రెడ్డి

Vijaysai reddy slams Tdp for raising false concerns over chandrababu health
  • చంద్రబాబు ఆరోగ్యస్థితిపై జైలు అధికారుల నివేదిక విడుదల
  • నివేదిక ప్రతిని సోషల్ మీడియాలో పంచుకున్న ఎంపీ విజయసాయి రెడ్డి 
  • చంద్రబాబు సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారన్న ఎంపీ
  • ఇంకెంత కాలం ఈ డ్రామాలు అంటూ మండిపాటు  
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు అనారోగ్యం పాలయ్యారంటూ టీడీపీ నేతలు భయాందోళనలు వ్యక్తం చేయడంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. బెయిల్ రాకపోయేసరికి టీడీపీ వారు అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత ఆరోగ్యస్థితిపై రాజమహేంద్రవరం జైలు అధికారులు విడుదల చేసిన నివేదికను ఆయన ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. 

నెలరోజుల పాటు జైల్లో ఉన్న కారణంగా చంద్రబాబుకు విశ్రాంతి దొరికి కిలో బరువు పెరిగారని విజయసాయి రెడ్డి కామెంట్ చేశారు. ఇతరత్రా అనారోగ్యాలు కూడా పోయి సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారన్నారు. దీంతో, టీడీపీ దుష్ప్రచారం రుజువైందని, ఇలా ఎంతకాలం తెలుగు డ్రామా పార్టీల నాటకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vijay Sai Reddy
Chandrababu
YSRCP
Telugudesam

More Telugu News